Mareechika: నిర్మాతగా మారిన టాలీవుడ్ రైటర్.. అనుపమ, రెజీనాలతో సినిమా ప్రకటన!

Mareechika Movie Cast and Crew Details: ఓ బేబీ, నేనే ముఖ్యమంత్రి వంటి సినిమాలకు రచయితగా పని చేసిన లక్ష్మీ భూపాల్ ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. వన్ మోర్ హీరో మీడియాతో కలిసి మరీచిక  అనే సినిమా నిర్మిస్తున్నానని అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2022, 06:40 PM IST
  • లక్ష్మీ భూపాల్ నిర్మాతగా సినిమా ప్రకటన
  • అనుపమ, రెజీనా హీరోయిన్లుగా మరీచిక
  • ఆసక్తికరంగా ప్రీ లుక్ పోస్టర్
 Mareechika: నిర్మాతగా మారిన టాలీవుడ్ రైటర్.. అనుపమ, రెజీనాలతో సినిమా ప్రకటన!

Mareechika Movie Cast and Crew Details: సినీ రంగంలో వివిధ విభాగాల్లో ఉన్న వారు నిర్మాణ రంగంలోకి రావడం చాలా సాధారణం. అయితే ఇప్పుడు తెలుగు రచయిత ఒకరు నిర్మాతగా మారారు. ఓ బేబీ,  నేనే ముఖ్యమంత్రి వంటి సినిమాలకు రచయితగా పని చేసిన లక్ష్మీ భూపాల్ ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. తాజాగా ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. సినిమా రంగం నాకు చాలా ఇచ్చిందన్న ఆయన,  మంచి సినిమాలు తీసి,  ప్రేక్షకులకు అందివ్వడంతో నా కృతజ్ఞతలు తెలిపే సమయం వచ్చిందని అన్నారు. అందుకే ఒకేసారి రెండు సినిమాలు మొదలుపెట్టాను..అందులో మరీచికా రెండవ సినిమా అని అన్నారు.

వన్ మోర్ హీరో మీడియాతో కలిసి మరీచిక అనే సినిమా నిర్మిస్తున్నానని అన్నారు. . నన్ను నమ్మి నిర్మాణానికి ముందుకొచ్చిన ఆ సంస్థ నిర్మాత రాజీవ్ చిలక గారికి నా ధన్యవాదాలు అని అన్నారు. ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో.. రెజీనా,  అనుపమ పరమేశ్వరన్,  విరాజ్ అశ్విన్ తదితరులు నటిస్తున్నారని అన్నారు. ఇక ఈ సినిమాకి కథ - స్క్రీన్_ప్లే - మాటలు - పాటలు లక్ష్మీ భూపాల అందిస్తూ ఉండగా సంగీతం ఇళయరాజా అందిస్తున్నారు. హిందీ ఎన్హెచ్ 10 కెమెరామెన్ అరవింద్ కన్నాభిరాన్ ఈ సినిమాకు కెమెరా బాధ్యతలు చూస్తున్నారు.

ఎడిటర్ గా జునైద్ సిద్ధిఖీ వ్యవహరిస్తూ ఉండగా దర్శకత్వం సతీష్ కాసెట్టి చేయనున్నారు. అయితే ఆయన మొదటి సినిమా ప్రకటించ లేదు. దీంతో మొదటి సినిమా ఏంటి? అనేది కూడా అతిత్వరలో చెప్పేస్తానని,  అది కొంతభాగం షూటింగ్ కూడా జరిగిందని అన్నారు. ఇక ‘మ‌రీచిక’ అనే టైటిల్‌కు క‌ళ్ల‌ను క‌నిక‌ట్టు చేసే భ్ర‌మ అని  అర్థం అంటున్నారు. ఈ ‘మరీచిక’ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను గురువారం రోజున విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌ను గ‌మనిస్తే అందులో కేవ‌లం ఒక యువతి పాదాలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. అంటే కాదు ఈ సినిమాకు ‘ప్రేమ ద్రోహం ప్ర‌తీకారం’ అనే క్యాప్షన్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వగా జూలై 26 నుంచి రెండో షెడ్యూల్ షూట్ ప్రారంభం కానుంది  

Image

Read Also: The Warriorr Review: పోలీస్ ఆఫీసర్గా రామ్ నటించిన 'ది వారియర్' సినిమా ఎలా ఉందంటే ?

Read Also: Kangana Ranaut Emergency: ఇందిరాగాంధీగా అదరకొట్టిన కంగ‌నా ర‌నౌత్‌.. ఎమ‌ర్జెన్సీ టీజ‌ర్ చూశారా?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News