Zomato Sorry to Urfi Javed : ఉర్ఫీ జావెద్‌కు జొమాటో క్షమాపణలు.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ

Zomato Says Sorry to Urfi Javed ఉర్ఫీ జావెద్‌కు ఈ మధ్య ఓ చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఓ రెస్టారెంట్‌లో ఉర్ఫీని అనుమతించలేదు. తనకు అలవాటైన పిచ్చి డ్రెస్సులో వెళ్లింది. దీంతో హోటల్ సిబ్బంది ఆమెను అడ్డగించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2023, 09:04 PM IST
  • నెట్టింట్లో ఉర్ఫీ సందడి
  • రెస్టారెంట్‌లోకి ఉర్ఫీకి నో ఎంట్రీ
  • క్షమాపణలు చెప్పిన జొమాటో
Zomato Sorry to Urfi Javed : ఉర్ఫీ జావెద్‌కు జొమాటో క్షమాపణలు.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ

Zomato Says Sorry to Urfi Javed ఒక్కోసారి సెలెబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అభిమానుల ద్వారా ఇలాంటి ఘటనలు హీరోయిన్లకు ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా ఉర్ఫీ జావెద్‌కు ఓ రెస్టారెంట్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. తన వింత బట్టలతో రెస్టారెంట్‌లోకి వస్తుంటే.. అక్కడి సిబ్బంది వద్దని వారించింది. ఇలాంటి దుస్తులతో ఎంట్రీ ఇవ్వకూడదన్నట్టుగా వారించింది. దీంతో ఉర్ఫీ జావెద్ తన అసహనాన్ని ప్రదర్శించింది.

ఆ తరువాత సోషల్ మీడియాలో ఈ ఘటన గురించి రాసుకొచ్చింది. జొమాటో వారు ఇంకా ఏ కాలంలో ఉన్నారు.. నేను ధరించే బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చిన దుస్తులను వేసుకుంటే.. మీ రెస్టారెంట్లోకి అనుమతి ఇవ్వరా? ఇదెక్కడి చోద్యం అంటూ ఇలా తన నోటికొచ్చినట్టుగా మండి పడుతూ వచ్చింది ఉర్ఫీ జావెద్. తాజాగా ఉర్ఫీనే ఈ విషయంలో నెగ్గింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

జొమాటో గోల్డ్ డైనింగ్ కార్నివల్ జరుగుతూ ఉంటే.. అందులోకి వెళ్లేందుకు ఉర్ఫీ ప్రయత్నించగా ఈ చేదు అనుభవం ఎదురైంది. దీంతో జొమాటోకు కంప్లైంట్ చేసింది ఉర్ఫీ జావెద్. దానికి స్పందించిన జొమాటో సంస్థ.. ఉర్ఫీకి క్షమాపణలు చెప్పింది. ఈ కార్నివాల్‌ను ఎంజాయ్ చేసేందుకు ప్రతీ ఒక్కరూ యాభై శాతం సేవ్ చేసుకుంటారు.. వారి వారి టేబుల్స్‌ను బుక్ చేసుకుంటున్నారు.. నెక్ట్స్ టైం మీరు ఎంజాయ్ చేయండి.. ఈ ఆఫర్ జూన్ 4 వరకు అందుబాటులో ఉందని ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ను ఉర్ఫీకి పంపించింది జొమాటో.

Also Read: Aham Brahmasmi : మౌనిక కోసం 'అహంబ్రహ్మాస్మి' వదిలేశా.. ఏడాదిన్నర చెన్నైలో.. మంచు మనోజ్ ఎమోషనల్

అదంతా సరే.. నాకు డ్రెస్సును పంపించినందుకు థాంక్స్ అని ఉర్ఫీ రిప్లై ఇచ్చింది. మేం డ్రెస్ ఎక్కడ పంపాం.. గిప్ట్ బాస్కెట్ కదా? ఇచ్చింది అని జొమాటో ఆశ్చర్యపోయింది. అంటే గిఫ్ట్ ప్యాక్‌తోనే ఉర్ఫీ డ్రెస్ తయారు చేసుకుని మళ్లీ రెస్టారెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా ఉంది. అంటే ఈ సారి ఉర్ఫీ నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ వచ్చేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక ఆ గిఫ్ట్ ప్యాక్‌తో తయారు చేసుకున్న డ్రెస్సును ధరించడంతో నెటిజన్లు ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోతోన్నారు.

Also Read:  Sai Dharam Tej Accident : సాయి ధరమ్ తేజ్ అబద్దం చెప్పాడా?.. సాయం చేసిన వ్యక్తికి కష్టాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News