Vishnu Manchu Ginna : జిన్నాను కొరియన్,జపనీస్, చైనీస్‌లో విడుదల చేస్తున్నారా?.. పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్‌కు మంచు విష్ణు కౌంటర్

Vishnu Manchu Counters to Pawan Kalyan Fans తాజాగా మంచు విష్ణు ట్విట్టర్‌లో తన అభిమానులతో జిన్నా ప్రమోషన్స్‌లో భాగంగా ముచ్చటించాడు. అందులో పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్ వేసిన ప్రశ్నకు కౌంటర్లు ఇచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2022, 09:03 AM IST
  • అక్టోబర్ 21న రాబోతోన్న జిన్నా మూవీ
  • ప్రమోషన్స్‌లో బిజీగా మంచు విష్ణు
  • కౌంటర్లు వేసిన పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్
Vishnu Manchu Ginna : జిన్నాను కొరియన్,జపనీస్, చైనీస్‌లో విడుదల చేస్తున్నారా?.. పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్‌కు మంచు విష్ణు కౌంటర్

Vishnu Manchu Ginna : మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ కాంబోలో రాబోతోన్న చిత్రం జిన్నా. టైటిల్ ప్రకటన దగ్గరి నుంచి ఈ మూవీ ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంటూనే ఉంది. మొత్తానికి సినిమా మీద మాత్రం మంచి బజ్ ఏర్పడింది. ఇందులో భాగంగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇది వరకు ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ మళ్లీ వెనక్కి తగ్గారు.

అక్టోబర్ 21న ఈ చిత్రం విడులయ్యేందుకు సిద్దంగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మంచు విష్ణు ఫుల్ యాక్టివ్ అయ్యాడు. మీడియా ముందుకు వస్తున్నాడు. ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఇక సోషల్ మీడియాలోనూ మంచు విష్ణు హవా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అతను వేసే ట్వీట్లు, షేర్ చేసే ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఎంత ట్రోలింగ్ జరిగినా కూడా మంచు విష్ణు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే తాజాగా జిన్నా కోసం మంచు విష్ణు ట్విట్టర్లో తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేశాడు.

మంచు విష్ణుని రకరకాల ప్రశ్నలు వేశారు నెటిజన్లు. మీ వాట్సప్ నంబర్ చెప్పమని ఒకడు అడిగితే.. సున్నా నుంచి తొమ్మిది అంకెలను చెప్పేసి కౌంటర్ వేశాడు విష్ణు. మీరు అనవసరంగా చిరంజీవిని ఎందుకు టార్గెట్ చేస్తారు? అని నిలదీశాడు ఇంకో నెటిజన్. నేను ఎప్పుడూ చేయలేదు.. చేయను కూడా.. అని ఆన్సర్ ఇచ్చాడు. సన్నీ లియోన్ ఫుల్ లెంగ్త్ కారెక్టరా? లేక ఒక పాట వరకేనా? అని మరో నెటిజన్ అడుగుతాడు. ఫుల్ లెంగ్త్ అని విష్ణు ఆన్సర్ ఇచ్చాడు.

 

జిన్నా తరువాత శ్రీను వైట్లతో సినిమా చేయబోతోన్నట్టు చెప్పుకొచ్చాడు. జిన్నాను పాన్ ఇండియన్ మూవీగా ప్లాన్ చేసినట్టు తెలిపాడు. ఇదేమీ తమిళ సినిమాకు రీమేక్ కాదు.. ఒరిజినల్ మూవీనే అని క్లారిటీ ఇచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్ ఒకరు జిన్నా రిలీజ్ మీద కౌంటర్లు వేశాడు. ఈ చిత్రాన్ని కొరియన్. జపనీస్, చైనీస్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారని విన్నాను.. నిజమేనా? అని సెటైరికల్‌గా అనేశాడు. దీనికి మంచు విష్ణు కూడా అంతే సెటైరికల్‌గా సమాధానం ఇచ్చాడు. అవును.. నువ్ రైట్స్ కొనుక్కుని రిలీజ్ చేస్తావా? అని కౌంటర్లు వేశాడు.

Also Read : Kantara Movie Collections : కాంతారాకు పెట్టింది ఎంత?.. వచ్చింది ఎంత?

Also Read : Godfather Vs Kantara : చిరంజీవిని దెబ్బ కొట్టేసిన అల్లు అరవింద్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News