Vakeel Saab benefit shows: వకీల్ సాబ్ బెనిఫిట్ షోలకు పర్మిషన్ వచ్చిందా ?

Vakeel Saab benefit shows latest updates: వకీల్ సాబ్ మూవీని సాధారణ ఆడియెన్స్ కంటే ముందుగా చూసి ఎంజాయ్ చేయాలనుకునే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో వకీల్ సాబ్ మూవీ బెనిఫిట్ షోలకు నిర్మాత దిల్ రాజు దాదాపు అనుమతి తెచ్చుకున్నట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2021, 11:28 PM IST
  • పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ రానుందా ?
  • వకీల్ సాబ్ మూవీ బెనిఫిట్ షోలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చిందా ?
  • ఎర్లిమార్నింగ్ షోలు, లేట్ నైట్ షోలకు అనుమతి కోసం నిర్మాత దిల్ రాజు విశ్వప్రయత్నాలు
Vakeel Saab benefit shows: వకీల్ సాబ్ బెనిఫిట్ షోలకు పర్మిషన్ వచ్చిందా ?

Vakeel Saab benefit shows latest updates: వకీల్ సాబ్ మూవీని సాధారణ ఆడియెన్స్ కంటే ముందుగా చూసి ఎంజాయ్ చేయాలనుకునే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో వకీల్ సాబ్ మూవీ బెనిఫిట్ షోలకు నిర్మాత దిల్ రాజు దాదాపు అనుమతి తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఫిలింనగర్ టాక్ ప్రకారం దిల్ రాజు తనకున్న పరిచయాలు, నెట్ వర్క్ అంతా ఉపయోగించి వకీల్ సాబ్ మూవీ బెనిఫిట్ షోలకు అనుమతి పొందినట్టు సమాచారం అందుతోంది. వకీల్ సాబ్ మూవీ ఏప్రిల్ 9న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఎర్లీ మార్నింగ్ షోలతో పాటు లేట్ నైట్ షోలకు కూడా అనుమతి లభించినట్టేనని సినీవర్గాల్లో ఓ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై రేపు ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నాయి సినీవర్గాలు. 

వకీల్ సాబ్ బెనిఫిట్ షోలకు (Vakeel Saab benefit shows) పోలీసులు సుముఖంగా లేరనే టాక్ వినిపిస్తున్నప్పటికీ.. దిల్ రాజు ప్రభుత్వంలోని పెద్దలను కలిసి అనుమతి పొందేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారని ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 

Also read : Republic Teaser: సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ టీజర్ విడుదల, పవర్ ఫుల్ కాన్సెప్ట్

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ మూవీకి UA సర్టిఫికెట్ ఇచ్చారు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన వకీల్ సాబ్ మూవీపై ఆడియెన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్‌లో తెరకెక్కిన పింక్ మూవీకి తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన వకీల్ సాబ్ మూవీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇమేజ్‌కి తగినట్టుగా డైరెక్ట్ చేశానని వేణు శ్రీరామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News