Urfi Javed Pics : ఉర్పీ వింత డ్రెస్సు.. చర్మం మొత్తం ఎర్రగా అయిందట!.. అయినా తగ్గేదేలే

Urfi Javed Dress Struggles ఉర్పీ జావెద్ వింత వింత దుస్తులు వేసుకుంటుందన్న సంగతి తెలిసిందే. ఆ డ్రెస్సుల వల్ల తనకు ఎంత బాధను అనుభవిస్తుందో, నొప్పిని భరిస్తుంటుందో చెబుతూ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2023, 02:08 PM IST
  • కొత్త బట్టలతో ఉర్ఫీ జావెద్ సందడి
  • నొప్పి, బాధ గురించి ఉర్ఫీ పోస్ట్
  • దెబ్బకు చర్మం కమిలిపోయిందిగా
Urfi Javed Pics : ఉర్పీ వింత డ్రెస్సు.. చర్మం మొత్తం ఎర్రగా అయిందట!.. అయినా తగ్గేదేలే

Urfi Javed Dress Struggles బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ తాజాగా తాను పడుతున్న కష్టాల గురించి చెప్పింది. తాను కొత్త కొత్తగా అవుట్ ఫిట్లను ప్రయత్నిస్తున్న క్రమంలో ఇలాంటి నొప్పి, బాధలు వస్తుంటాయని చెప్పింది. తాజాగా ఓ డ్రెస్‌ను ఉర్ఫీ వేసుకుంది. అందులో సైడ్‌ పార్ట్ మొత్తం ఓపెన్‌గా ఉంది. అందులో తీగలో ఆ డ్రెస్సును కుట్టినట్టు కనిపిస్తోంది. అందులో నిజమైన వైర్లు ఉన్నాయని వాటి వల్ల తన చర్మం ఎలా డ్యామేజ్ అయిందో చూడమని చెప్పుకొచ్చింది.

తాను వేసుకున్న డ్రెస్సు ఎలాంటి నొప్పిని కలిగిస్తుంటుందో అని చూపించింది ఉర్ఫీ జావెద్. అయినా తగ్గేదేలే అన్నట్టుగా అందాలను ప్రదర్శిస్తోంది. ఇక ఆమె అందాల ప్రదర్శన ఎప్పుడూ ఇలా హాట్ టాపిక్ అవుతూనే ఉంటుందని అందరికీ తెలిసిందే. గత వారం జొమాటోతో జరిగిన ఇష్యూతో వార్తల్లో నిలిచింది.

జొమాటో పెట్టిన ఫెస్టివల్‌కు ఉర్పీ వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ ఆ రెస్టారెంట్‌లో ఉర్ఫీని అనుమతించలేదు. ఆమె ధరించిన డ్రెస్సును చూసి బాబోయ్ అని అన్నట్టున్నారు. దీంతో ఆమెను లోపలకి అనుమతించలేదు. అలా తనను అడ్డగించడంతో ఉర్ఫీ మండి పడింది. ఇంకా ఏ కాలంలో ఉన్నారు.. ఇలా చేస్తున్నారేంటి? అంటూ ఫైర్ అయింది.

ఆ తరువాత జొమాటో నుంచి ఆమెకు క్షమాపణలు అందాయి. అంతే కాకుండా ఆమె కోసం స్పెషల్‌గా ఓ గిఫ్ట్‌ను కూడా పంపించింది జొమాటో. అయితే ఆ గిఫ్ట్ ప్యాక్‌తోనే ఓ డ్రెస్సును తయారు చేసుకుంది ఉర్ఫీ. డ్రెస్సును పంపించినందుకు థాంక్స్ అంటూ ఉర్ఫీ అంటే.. మేం డ్రెస్ ఎక్కడ పంపాం.. గిఫ్ట్ కదా? అని షాక్ అయింది. అలా ఉర్ఫీ ఎప్పుడూ తన డిఫరెంట్ ఆలోచనలతో కొత్త అవుట్ ఫిట్‌లను తయారు చేసుకుంటుంది.

Also Read:  Malavika Mohanan : ఆ పార్ట్ మీదే ఫోకస్.. అద్దం ముందు మాళవిక అందాల ప్రదర్శన

బిగ్ బాస్ షోలు, రియాల్టీ షోలు, సీరియల్స్ అంటూ ఉర్ఫీ జావెద్ బాగానే ట్రెండ్ అయింది. అయితే ఓటీటీలో వచ్చిన బిగ్ బాస్ షోతోనే ఎక్కువగా క్రేజ్ దక్కించుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వెరైటీ దుస్తులను ధరించి ఫోటో షూట్లు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

Also Read:  Aadi Sai Kumar Wife : ఇలా కూడా ఉంటారా?.. ఆది సాయి కుమార్ భార్య కోరిక, కల ఇదేనట

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News