Tillu Square: ఆన్‌లైన్‌లో టిల్లు స్క్వేర్ ఫుల్ మూవీ..? ఇండస్ట్రీని వీడని పైరసీ గోల..!

Tillu Square Full Movie: బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ టిల్లు స్వ్కేర్ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. సిద్దూ జొన్నలగడ్డ తన టైమింగ్ కామెడీతో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. భారీ కలెక్షన్లు రాబడుతున్న ఈ మూవీ.. పైరసీ బారిన పడినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో మూవీ ప్రింట్ ప్రత్యక్షమైనట్లు సమాచారం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2024, 05:19 PM IST
Tillu Square: ఆన్‌లైన్‌లో టిల్లు స్క్వేర్ ఫుల్ మూవీ..? ఇండస్ట్రీని వీడని పైరసీ గోల..!

 Tillu Square Full Movie Online: టిల్లు స్క్వేర్ మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు సిద్దూ జొన్నలగడ్డ. డీజే టిల్లుకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన టిల్లు స్క్వేర్.. మార్చి 29న ఆడియన్స్ ముందుకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. టిల్లు బాడీలాంగ్వేజ్‌, పంచ్ డైలాగ్స్‌తో థియేటర్లు మార్మోగుతున్నాయి. నాలుగు రోజుల్లో రికార్డు వసూళ్లతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు రూ.85 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి.. రూ.100 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుంది.

Also Read: Nails Care: గోర్లు పెంచుతున్నారా? అయితే ఈ టిప్స్‌ మీకోసమే..

రూ.27 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్‌తో బాక్సాఫీసు ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్.. రూ.28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా పెట్టుకుంది. ఆడియన్స్ నుంచి అద్భుత రెస్పాన్స్‌తో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. రూ.16 కోట్ల లాభంతో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఓటీటీ డిజిటల్ రైట్స్ రూ.15 కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్‌ కూడా రూ.5 కోట్ల అమ్ముడయ్యాయని చెబుతున్నారు. 

టిల్లు మూవీ సూపర్ హిట్ కావడంపై అన్ని వైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా సిద్దూ జొన్నలగడ్డను ఇంటికి పిలిపించుకుని అభినందించారు. సినిమా అద్భుతం అని.. తనకు చాలా బాగా నచ్చిందని మెచ్చుకున్నారు. మొదటి సినిమా హిట్ అయిన తరువాత సీక్వెల్ తీస్తే అంచనాలు భారీగా ఉంటాయని.. వాటిని అందుకోవడం అంత ఈజీ కాదన్నారు. కానీ సిద్దూ అండ్ టీమ్ ఆడియన్స్ మెచ్చేలా సీక్వెల్‌ను అందించడంలో విజయవంతం అయ్యారని అన్నారు.

ఇక ఇటీవల రిలీజ్ అయిన ప్రతి సినిమాలు పైరసీ బారినపడుతుండడంపై మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిల్లు స్క్వేర్ ఓటీటీలోకి రాకముందే ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. పైరసీ కంటెంట్‌తో విజృంభిస్తున్న పలు వెబ్‌సైట్‌లు టిల్లూ స్క్వేర్ సినిమా మొత్తం కంటెంట్‌ను కాపీ చేసి లింక్‌ల రూపంలో ఇంటర్నెట్‌లో షేర్ చేసినట్లు సమాచారం. కొంతమంది వినియోగదారులు సినిమాను చూసేందుకు, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ లింక్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇలా ఫ్రీగా సినిమా చూడొచ్చని ఆశతో గుర్తు తెలియని లింక్స్‌పై క్లిక్ చేస్తే ఆన్‌లైన్ కేటుగాళ్లు మీ ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉంది. పైరసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించవద్దు. 1957 కాపీరైట్ చట్టం ప్రకారం పైరసీ క్రిమినల్ నేరం. పైరసీని సమర్ధించినా.. లేదా ప్రోత్సహించినా శిక్షార్హులవుతారు.

Also Read: Glass Symbol: కూటమి కొంప ముంచనున్న గాజు గ్లాసు, ఈసీని ఆశ్రయించనున్న జనసేన

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitter సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News