Siddhu Jonnalagadda: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో డీజే టిల్లు నయా మూవీ

Siddhu Jonnalagadda: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా కొత్త మూవీ ప్రారంభం అయ్యింది. SVCC బ్యానర్ పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 11, 2023, 08:35 AM IST
Siddhu Jonnalagadda: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో డీజే టిల్లు నయా మూవీ

Siddhu jonnalagadda new movie: సిద్ధు జొన్నలగడ్డ(Siddhu jonnalagadda)-బొమ్మరిల్లు భాస్కర్‌(Bommarillu Bhaskar) కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రారంభోత్సవం గురువారం హైదారాబాద్‌లో జరిగింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం(SVCC )పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సంస్థలో రాబోతున్న 37వ సినిమా ఇది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌నివ్వగా, దిల్‌ రాజు కెమెరా స్విఛాన్‌ చేశారు. 

ఓ సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత తెలిపారు. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయన్నారు. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. బాపినీడు సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ  శ్రీలీల ను హీరోయిన్ తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Venkateswara Cine Chitra (SVCC) (@svccofficial)

గతేడాది రిలీజైన 'డీజే టిల్లు'తో యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. 'టిల్లు స్క్వేర్'(Tillu Square) గా రాబోతున్న ఈ సినిమాలో సిద్ధుకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్ మిరియాల మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సాయి ప్రకాశ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహారిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. 

Also read: Bholaa Shankar Twitter Review: చిరంజీవి 'భోళాశంకర్' హిట్టా? ఫట్టా?

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. జూలై 26న ‘'టికెట్టే కొనకుండా'’ అనే తొలి లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. సిద్ధు, అనుపమ పరమేశ్వన్ మధ్య రొమాటింక్ సీన్లును ఈ పాటలో చూపించారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. రామ్ మిర్యాల స్వరాలు సమకూర్చారు. టిల్లు స్క్వేర్ చిత్రానికి శ్రీచరణ్ పాకాల కూడా మరో సంగీత దర్శకుడిగా ఉన్నారు. ఈ పాట రిలీజ్ కు ముందే అనుపమను సిద్ధు ఫ్లర్ట్ చేస్తున్నట్టు ప్రోమోను రిలీజ్ చేసి.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇది నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. 

Also read: Bhagavanth Kesari: భగవంత్ కేసరి నుంచి నయా పోస్టర్ విడుదల.. ఊరమాస్‌ లుక్ లో బాలయ్య..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News