DJ Tillu Square : సక్సెస్ తలకెక్కిందా?.. డిజే టిల్లు స్క్వేర్ విషయంలో సిద్దు ఏం చేస్తున్నాడు?

Siddhu Jonnalagadda DJ Tillu Square సిద్దు జొన్నలగొడ్డ బిహేవియర్ మారినట్టు కనిపిస్తోంది. డీజే టిల్లు సినిమా సక్సెస్ అవ్వడంతో సిద్దు రేంజ్ మారిపోయింది. దీంతో ఈ మూవీ సీక్వెల్ మీద కూడా మంచి హైప్ ఏర్పడింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2022, 12:47 PM IST
  • డీజే టిల్లు స్క్వేర్ వివాదాలు
  • ప్రాజెక్ట్‌లోంచి అనుపమ అవుట్?
  • తెరపైకి కొత్తగా మడోన్నా పేరు
DJ Tillu Square : సక్సెస్ తలకెక్కిందా?.. డిజే టిల్లు స్క్వేర్ విషయంలో సిద్దు ఏం చేస్తున్నాడు?

Siddhu Jonnalagadda DJ Tillu Square : ఒక్కో సారి సినిమా ఎందుకు హిట్ అవుతుంది.. ఎందుకు అంత క్రేజ్ వస్తుంది.. ట్రెండ్ ఎలా నడుస్తోంది.. జనాల నాడి ఎలా ఉందో చెప్పడం కష్టం అవుతుంది. అలానే డీజే టిల్లు సినిమా ఇలా వచ్చి అలా సెన్సేషన్‌గా మారింది. ఎందుకు అంత పెద్ద హిట్ అయిందంటే సరైన కారణాలు కూడా చెప్పలేం. జనాల మూడ్‌ అప్పుడు డీజే టిల్లుకు ట్యూన్ అయింది. సిద్దు లుక్స్, యాటిట్యూడ్, గెటప్, యాస, భాష ఇలా అన్నీ కూడా జనాలను కట్టిపడేసింది.

కథ, కథనాలు పక్కన పెట్టేసి మరీ జనాలు డీజే టిల్లు, రాధిక పాత్రలకు కనెక్ట్ అయిపోయారు. డీజే టిల్లు భారీ సక్సెస్ అవ్వడంతో సీక్వెల్ మీద ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఈ సీక్వెల్ విషయానికి వచ్చే సరికి సిద్దు యాటిట్యూడ్‌లో మొత్తం మారినట్టు కనిపిస్తోంది. డీజే టిల్లు సక్సెస్ తలకెక్కిందా? అనే అనుమానాలు పుట్టుకొచ్చేస్తున్నాయి.

డీజే టిల్లుని తెరకెక్కించిన డైరెక్టర్ విమల్ కృష్ణ పక్కకి తప్పుకున్నాడు. ఆయనే తప్పుకున్నాడు.. తప్పించారా? లేక తప్పుకోవాల్సి వచ్చిందా? అన్నది తెలియదు. ఇక రాధికగా నేహా శెట్టిని కూడా పక్కన పెట్టేశారు. శ్రీలీలను హీరోయిన్‌గా ప్రకటించారు. మళ్లీ తప్పించేశారు. అనుపమ పరమేశ్వరణ్‌ని తీసుకున్నారు.. ఇప్పుడు ఆమెను కూడా తప్పించేశారు. వీటన్నంటికి సిద్దు బిహేవియరే కారణమని తెలుస్తోంది. సిద్ద యాటిట్యూడ్‌ వల్లే ఇదంతా జరుగుతోందనే ప్రచారం బయటకు వచ్చింది.

సిద్దు కావాలనే ఇలా మరీ ఎక్కువగా స్క్రిప్ట్ విషయంలో, క్యాస్టింగ్ విషయంలో తలదూర్చి ఇలా చేస్తున్నాడని టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. అనుపమ, సిద్దుల మధ్య సెట్స్‌లో పెద్ద చర్చలే జరిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే సిద్దు ఇలా కావాలని చేస్తున్నాడా? అన్నది తెలియడం లేదు. ఇప్పుడు కొత్తగా ఈ సినిమాలో హీరోయిన్‌గా మడొన్నా సెబాస్టియన్ పేరు వినిపిస్తోంది. ఈమె అయినా చివరి వరకు ఉంటుందా? ఉండనిస్తారా? అన్నది చూడాలి. ఇదంతా చూస్తోన్న నెటిజన్లు.. డీజే టిస్లు సక్సెస్ సిద్దు తలకు ఎక్కిందా? అని కామెంట్లు పెడుతున్నారు. మరి డీజే టిల్లు స్వ్కేర్ ఎలా ఉంటుందో చూడాలి. మళ్లీ మ్యాజిక్ చేస్తుందా? అన్నది చూడాలి.

Also Read : Ram Charan in New Zealand : RC 15 న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి.. రామ్ చరణ్‌, కియారా లుక్స్ వైరల్

Also Read : Vijay Devarakonda ED: 'లైగర్' చిక్కుల్లో విజయ్ దేవరకొండ.. ఈడీ విచారణకు హాజరు?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News