Ravi Teja పుట్టినరోజు కానుకగా Khiladi Movie First Glimpse రిలీజ్ చేసిన మూవీ యూనిట్

Happy Birthday Ravi Teja: పుట్టినరోజు కానుకగా మాస్ మహారాజా రవితేజ ఖిలాడి అప్‌డేట్‌ను మూవీ యూనిట్ అందించింది. నేడు విడుదలైన ఖిలాడీ మూవీ ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. రవితేజకు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 26, 2021, 02:04 PM IST
  • టాలీవుడ్‌లో స్వశక్తితో ఎదిగిన నటుడు రవితేజ
  • ‘క్రాక్’ విడుదలై ఘన విజయాన్ని అందుకుంది
  • రవితేజ అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ అందించాడు
Ravi Teja పుట్టినరోజు కానుకగా Khiladi Movie First Glimpse రిలీజ్ చేసిన మూవీ యూనిట్

Ravi Tejas Khiladi Movie First Glimpse: టాలీవుడ్‌లో స్వశక్తితో ఎదిగిన నటుడు రవితేజ. నేడు మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు. ఇదివరకే సంక్రాంతి కానుకగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రాక్’ విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. అంతలోనే రవితేజ మరో ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు.

 

రవితేజ అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ అందించాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ(Happy Birthday Ravi Teja) లేటెస్ట్ మూవీ ‘ఖిలాడి’లో నటిస్తున్నారు. నేడు రవితేజ పుట్టినరోజు కానుకగా ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్‌ వీడియోను అందించారు. రవితేజ తన ఎనర్జీని మళ్లీ చూపించారు. ముఖ్యంగా ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. 

Also Read: RRR Release Date: ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన Director Rajamouli

 

ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ బర్త్‌డే సందర్భంగా కేవలం విషెస్ తెలుపుతూ ఒక్క డైలాగ్ కూడా లేని వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఖిలాడి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. 

Also Read: Mahesh Babu: ట్రెండ్ క్రియేట్ చేస్తున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News