Tillu Square: ''మరింత గ్లామర్‌ డోస్‌ పెంచుతా.. మీకేంటి అభ్యంతరం?'' టిల్లు లవర్‌ అనుపమ

Oh My Lily Song Out From Tillu Square: హీరోయిన్‌ అంటేనే సినిమాకు అదొక గ్లామర్‌. మరిం అలాంటిది సినిమాలో హీరోయిన్‌ గ్లామర్‌ డోస్‌ తగ్గిస్తే ప్రేక్షకులు నిరాశ చెందుతారు. అలాంటి వారికోసం మరింత డోస్‌ పెంచుతానని 'లిల్లీ' పాప అనుపమ పరమేశ్వరన్‌ చెబుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 18, 2024, 11:43 PM IST
Tillu Square: ''మరింత గ్లామర్‌ డోస్‌ పెంచుతా.. మీకేంటి అభ్యంతరం?'' టిల్లు లవర్‌ అనుపమ

Anupama Parameswaran: హాస్యభరిత 'డీజే టిల్లు'కు సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్‌'ఈనెల 29వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి మరో పాట విడుదలైంది. ఇప్పటికే 'రాధిక, టికెట్‌ కొనకుండా' అనే పాటలు విడుదలై సూపర్‌హిట్‌గా నిలవగా తాజాగా 'ఓహ్‌ మై లిల్లీ' అనే పాటను విడుదల చేశారు. ఈ పాట విడుదల వేడుక సోమవారం హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లు సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌, దర్శకుడు రామ్‌ మల్లిక్‌, నిర్మాత నాగవంశీని మీడియా పలు ప్రశ్నలు వేసింది. ఈ సందర్భంగా అనుపమను 'గ్లామర్‌ డోస్‌' పెంచారేంటి? అని ప్రశ్నించారు.

Also Read: Deepthi Sunaina: నలుపు రంగు డ్రెస్‌లో 'చేపపిల్లలా' సోషల్‌ స్టార్‌‌ దీప్తి సునైనా

'అందంగా కనిపించడం మంచిదే కదా. నా సినిమా కెరీర్‌లో నేను చేసి పాత్రల్లో లిల్లీ ప్రత్యేకం. మూడేళ్ల నుంచి కొత్త తరహా పాత్రల్లో నటించడం మొదలుపెట్టా. అంతకుముందు కొన్ని పరిమితుల దృష్ట్యా కొన్ని పాత్రలు చేయలేక వదులుకున్నా. అయినా అన్ని చిత్రాల్లో ఒకేలాంటి పాత్రల్లో నటించడం బోర్‌ ఫీలయ్యా. నటనకు ప్రాధాన్యం ఉంటేనే చేస్తా తప్ప హీరోయిన్‌ ఇమేజ్‌ కోసం కాదు' అని అనుపమ సమాధానం ఇచ్చింది. ఇక సినిమా కథ ఎంచుకోవడానికి కారణమేంటని, ఇతర హీరోయిన్లు వద్దన్న సినిమాను మీరెలా చేశారని మీడియా ప్రశ్నించింది.

Also Read: Organ Donation: చనిపోతూ ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించిన ఫుడ్ డెలివరీ బాయ్‌

 

ఆ ప్రశ్నలకు బదలిస్తూ అనుపమ 'నా వద్దకు కథ వచ్చింది నచ్చేసింది. లిల్లీ పాత్రను వదులుకోకూడదనుకుని నటించా అంతే. మిగతా విషయాలన్నీ నాకు తెలియదు. నా నటా జీవితం ప్రారంభమై పదేళ్లవుతోంది. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేయాలని కోరుకోవడం తప్పు కదా' అని సమాధానం ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించి మొదటి ఈవెంట్‌లో పాల్గొన్నట్లు లిల్లీ అదే అనుపమ తెలిపింది. 'ప్రేక్షకుల నుంచి స్పందన చూశాక చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి నుంచి ఒక్క ఈవెంట్‌ కూడా మిస్‌ కాను. ఈ ప్రేమ మాపై ఎప్పుడూ ఇలాగే ఉండాలి' అని కోరింది. ఇక టిల్లు స్క్వేర్‌ విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు, అందరికీ నచ్చుతుందని చెప్పింది.

డీజే టిల్లు కన్నా మరింత వినోదం టిల్లు స్క్వేర్‌ అందిస్తుందని హీరో సిద్ధూ జొన్నలగడ్డ తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 29వ తేదీన విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీఖర స్టూడియోస్‌ సమర్పిస్తోంది. రామ్‌ మిరియాల, అచ్చు రాజమణి నేపథ్య సంగీతం అందించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News