Nandamuri Balakrishna - Unstoppable : అలా ట్రై చేసినవన్నీ పోయాయట.. ఫ్లాపులను అంగీకరించేతత్వం.. దటీజ్ బాలయ్య

Nandamuri Balakrishna on Flops నందమూరి బాలకృష్ణ తన సినిమాల విషయంలో నిర్మొహమాటంగా మాట్లాడతాడు. ఆడని సినిమాల మీదా తన కామెంట్ చెబుతాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2022, 09:48 AM IST
  • అన్‌స్టాపబుల్ రెండో సీజన్ సందడి
  • రెండో ఎపిసోడ్ ప్రోమో హల్చల్
  • ఫ్లాపులపై బాలయ్య కామెంట్స్
Nandamuri Balakrishna - Unstoppable : అలా ట్రై చేసినవన్నీ పోయాయట.. ఫ్లాపులను అంగీకరించేతత్వం.. దటీజ్ బాలయ్య

Nandamuri Balakrishna Flops Movies : నందమూరి బాలకృష్ణ ఎన్ని హిట్లు కొట్టాడో.. ఎన్ని ఇండస్ట్రీ హిట్లు కొట్టాడో.. అదే రేంజ్ డిజాస్టర్లను ఇచ్చాడు. బాలయ్య వరుసగా ఓ దశాబ్దం పాటు ఫ్లాపులతోనే సతమతమయ్యాడు. ఇక బాలయ్య పని అయిపోయిందనుకున్న సమయంలోనే సింహా వచ్చింది. మళ్లీ నందమూరి అభిమానులకు ఊపిరినిచ్చింది. ఆ తరువాత మళ్లీ ఫ్లాపులు వచ్చాయి. ఆ తరువాత లెజెండ్ వచ్చి హిట్ అయింది. ఇక మధ్యలో మళ్లీ డిజాస్టర్లు వచ్చాయి. అయితే ఈ సారి అఖండ వచ్చింది. అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇప్పుడు బాలయ్య అన్ స్టాపబుల్ షోతోనూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆహాలో వస్తోన్న ఈ సీజన్‌ బాలయ్యలోని కొత్త కోణాన్ని చూపించింది. రెండో సీజన్ ఘనంగా ప్రారంభం అయింది. మొదటి ఎపిసోడ్ గత వారం ప్రసారమైంది. అందులో చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చారు. బావ, అల్లుడితో బాలయ్య ముచ్చట్లు పెట్టేశాడు. ఇక రెండో ఎపిసోడ్‌లో కుర్ర హీరోలను తీసుకొచ్చారు. విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డలతో ఈ రెండో ఎపిసోడ్ ప్లాన్ చేశారు.

ఇందులో యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‌లు వచ్చారు. అయితే ఇందులో సిద్దు హెయిర్ స్టైల్ చూసి బాలయ్య షాక్ అయ్యాడు. అసలే అది డీజే టిల్లు స్టైల్. ఇక డీజే టిల్లు స్టైల్ మీద బాలయ్య కౌంటర్ వేశాడు. ఎవరయ్యా.. ఆ హెయిర్ స్టైలీష్ట్.. ఇతడ్ని ఇలా పంపించారు.. దువ్వలేదా? అంటూ కౌంటర్ వేశాడు. సర్ ఇది మెస్సీ లుక్ అని ఏదో చెప్పేశాడు సిద్దు.

మెస్సీ లుక్‌తో చేసిన సినిమాలన్నీ మెస్సీ అయిపోయాయ్ అని బాలయ్య తన ఫ్లాప్ సినిమాల మీద పరోక్షంగా కౌంటర్లు వేసుకున్నాడు. అలా తన ఫ్లాపులను ఒప్పేసుకున్నాడు బాలయ్య. ఇక బాలయ్య ఇందులో త్రివిక్రమ్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. షోకు ఎప్పుడు వస్తావ్ అని అడిగాడు. మీరు ఓకే అంటే ఇప్పుడే వచ్చేస్తా అని అంటాడు త్రివిక్రమ్. ఎవరితో రావాలో తెలుసు కదా? అని పవన్ కళ్యాణ్‌ను తీసుకురా అని పరోక్షంగా చెప్పేశాడు బాలయ్య. మరి వీరి ఎపిసోడ్ వస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Also Read :  Kantara vs Godfather : కాంతారా దెబ్బకు గాడ్ ఫాదర్ గూటికి

Also Read :  Nikesha Patel-Pawan Kalyan : నీ వెంట నడుస్తా.. కొమురం పులి హీరోయిన్ ట్వీట్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News