Japan: దారుణంగా ఫెయిల్ అయిన కార్తీ సినిమా.. వారానికే థియేటర్స్ నుంచి ఔట్

Karthi 25th film : కార్తీ 25వ సినిమాగా వచ్చిన జపాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్రం తనకు చాలా పేరు తీసుకొస్తుందని ఎంతో నమ్మకంతో విపరీతమైన ప్రమోషన్లు చేశాడు కార్తీ. కానీ అవి కూడా ఈ సినిమాని కాపాడలేకపోయాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2023, 09:16 AM IST
Japan: దారుణంగా ఫెయిల్ అయిన కార్తీ సినిమా.. వారానికే థియేటర్స్ నుంచి ఔట్

Karthi: తమిళ్ వారితో పాటు తెలుగు వారు కూడా ఎంతగానో అభిమానించే హీరో కార్తీ. పేరుకి తమిళ్ హీరో అయినా కానీ ఈ హీరోకి తెలుగు రాష్ట్రాలలో అభిమానులు ఎక్కువే. సూర్య తమ్ముడిగా సినిమా ప్రేక్షకులకు పరిచయమైన కార్తి ఆ తరువాత తన వైవిద్యమైన నటనతో తనకు తానుగా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

కార్తీ నటించిన ఎన్నో చిత్రాలు తమిళ్లో, తెలుగులో సూపర్ హిట్లు గా నిలిచాయి. ఈ మధ్య కార్తీ నుంచి వచ్చిన ఖైదీ, సర్దార్ సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. కార్తీ నటించిన ఏ సినిమా కూడా ఇప్పటివరకు తెలుగులో మరీ ఘోర పరాజయం అయితే చవిచూడలేదు. ఇక అలాంటి హీరో కెరియర్ లో 25 వ సినిమాగా వచ్చిన చిత్రం జపాన్. కాగా కార్తీ లాంటి హీరో కెరియర్ లో మైలురాయిగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని అందరూ భావించారు. ఈ సినిమాలో మినిమం కంటెంట్ ఉంటుంది అని అలానే కార్తీ తప్పకుండా ప్రేక్షకులను ఎంత టైం చేస్తారు అని గట్టి నమ్మకంతో ఉనిన్నారు. కానీ ఈ సినిమా విడుదల అయ్యి అందరినీ షాక్ కి గురి చేసింది.

ఏ హీరో అయినా తమ కెరియర్ లో మైలురాయిగా వచ్చే సినిమా మంచి విజయం సాధించాలి అనే కసితో తీస్తారు. అందులో కార్తీ లాంటి హీరో 25వ సినిమా అంటే అలానే అనుకున్నారు అందరూ. కానీ ఈ చిత్రం మాత్రం దిజాస్టర్ గా మిగిలింది. కార్తీ  గుడ్డిగా  దర్శకుడు రాజు మురుగన్ ని నమ్మాడు ఏమో తెలియదు కానీ ఈ సినిమా కార్తీ ని అలానే ఈ చిత్ర ప్రొడ్యూసర్స్ ని పూర్తిగా ముంచేసింది. అర్థం లేని కథా కథనాలతో, అస్సలు ఆకట్టుకొని స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ రన్ చవిచూస్తోంది.

మొదటిరోజు కార్తీ ని నమ్మి కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమాని థియేటర్లో చూడడానికి వెళ్లిన.. ఆ తరువాత నుంచి అసలు ఈ సినిమా గురించి అనుకున్న ప్రేక్షకుడే లేదు. మరోపక్క జపాన్ రిలీజ్ అయిన రోజే విడుదలైన మరో చిత్రం జిగర్ తండా డబుల్ ఎక్స్ మొదటి షో కి జనాలు లేకపోయినా ఆ తరువాత హిట్ టాక్ తెచ్చుకొని అనూహ్యంగా 50 కోట్ల మార్కుని అందుకుంది.

కార్తీ చిత్రం మాత్రం ఇంకా 25 కోట్ల గ్రాస్ అందుకోడానికి కూడా తెగ కష్టపడుతోంది. మరో ఘోరమైన పరిస్థితి ఏమిటి అంటే అప్పుడే ఈ సినిమాని ఎన్నో థియేటర్స్ నుంచి తీసేస్తున్నారు. ఈ శుక్రవారం మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆ సినిమాల కోసం దాదాపు అన్ని థియేటర్స్ లో జపాన్ సినిమా తీసేసే లాగానే కనిపిస్తోంది. అంటే కార్తీ 25వ సినిమా కేవలం వారం రోజుల్లోనే థియేటర్స్ నుంచి ఎత్తేస్తున్నారు.‌ దీన్ని బట్టి ఈ చిత్రం ఎంత ఫైల్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

దీపావళి పండుగకు విడుదలైన ఈ సినిమాకి పోయిన వారం పెద్దగా పోటీ కూడా లేదు. కాబట్టి ఈ సినిమా కనీసం బాగున్నా జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా లాగా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకునేది. కానీ అస్సలు ఆకట్టుకొని కథ కథనంతో రావడంతో మొత్తం మీద బొక్క బోర్ల పడ్డారు జపాన్ చిత్ర మేకర్స్ అలానే హీరో కార్తీ.‌ ఇక ఈ సినిమా తో ఘోర పరాజయం చవిచూసిన కార్తీ తన తదుపరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటారేమో వేచి చూద్దాం.

Also Read: Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం

 

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News