Jr NTR: దేవర నుంచి రాబోతున్న అప్డేట్ అదే.. సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్

Devara Update: జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కోసం ప్రపంచమంతా ఎంతగానో ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ విడుదల కానుంది.. అసలు ఈ అప్డేట్ ఏంటి అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 15, 2024, 03:18 PM IST
Jr NTR: దేవర నుంచి రాబోతున్న అప్డేట్ అదే.. సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్

Devara First Lyrical: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. దీంతో ఈ హీరో తదుపరి సినిమాపై ప్రపంచం మొత్తం అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవరా చిత్రం గురించి.. ఏ చిన్న వార్త బయటకువచ్చిన అది కాస్త తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఈనెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి సినిమాల గురించి ఎటువంటి అప్డేట్స్ వస్తాయని అభిమానులు ఇప్పటినుంచే ఆసక్తిగా ఉన్నారు.

దేవర నుంచి తప్పకుండా ఒక అప్డేట్ ఉంటుంది అని అందరూ గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలో మే 20.. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవరా నుంచి రాబోయే అప్డేట్ ఇదే అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇటీవల దేవర మూవీ టీం ఒక ట్వీట్ వేశారు. అ ట్వీట్ తో ఎన్టీఆర్ బర్తడే సందర్భంగా దేవర సినిమా నుంచి మొదటి పాట వస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. 

ఇక మరోపక్క తాజాగా మ్యూజిక్ ఛానల్ అయిన T సిరీస్ సౌత్ వస్తున్నాం అంటూ దేవర వీడియో క్లిప్ తో పాటు మ్యూజిక్ సింబల్స్ పోస్ట్ చేశారు. దీంతో తాము T సిరీస్ సౌత్ ఛానల్ లో దేవర ఫస్ట్ సాంగ్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు ఈ ట్వీట్ తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజు దేవర ఫస్ట్ సింగల్ రాబోతోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 

ఇక జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవర అప్డేట్ తో పాటు వార్ 2 సినిమా నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ , ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా నుంచి కూడా ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఆయన అభిమానులు అంచనాలు వేస్తున్నారు. కాగా దేవర పార్ట్ 1 సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చెయ్యనున్నారు సినిమా యూనిట్.

Read more: MP Elections 2024: ఎన్నికల వేళ కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఇద్దరు భార్యలున్న వారికి కూడా ఆ పథకం.. వీడియో వైరల్..

Read more: Smell of Cooking Food: వంట స్మెల్ చూసి వావ్ అంటున్నారా..?.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎన్ఓఏఏ పరిశోధకులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News