Shahrukh Khan Jawan Prevue: జవాన్ ట్రైలర్ విడుదల.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న షారూఖ్ ఖాన్ లుక్

Jawan Trailer Released: అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్న షారూఖ్ ఖాన్ జవాన్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్‌లో బాద్‌షా లుక్ అదిరిపోయింది. సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

Written by - Ashok Krindinti | Last Updated : Jul 10, 2023, 01:37 PM IST
Shahrukh Khan Jawan Prevue: జవాన్ ట్రైలర్ విడుదల.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న షారూఖ్ ఖాన్ లుక్

Jawan Trailer Released:

బాలీవుడ్ బాద్‌షా హీరోగా షారూఖ్ ఖాన్ హీరోగా అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ జవాన్. పఠాన్‌ తరువాత కింగ్‌ఖాన్‌కి ఈ ఏడాది రెండో సినిమా ఇది. జవాన్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపికా పదుకొణె, నయనతార, విజయ్‌ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా రిలీజ్ చేయనున్నారరు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను మూవీ యూనిట్ షూరు చేసింది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జవాన్ ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని వీడియోలు లీక్ అవ్వగా మంచి బజ్ ఏర్పడింది. ట్రైలర్‌తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. 

ట్రైలర్‌లో షారూఖ్‌ ఖాన్ లుక్ చూస్తుంటే అభిమానులకు గూస్‌బంప్స్ వస్తున్నాయి. షారుఖ్ ఖాన్ వాయిస్‌తో ట్రైలర్‌ను ప్రారంభించారు. 'నేనెవరో నాకు తెలియదు. నాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు. నేను ఎవర్నీ కాను.. తెలియదు.. నేను మంచివాడినా..? చెడ్డవాడినా..? పుణ్యాత్ముడినో.. పాపాత్ముడినో.. నీకు నువ్వే తెలుసుకో.. ఎందుకంటే నేనే నువ్వు.. రెడీ' అంటూ షారూఖ్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్‌లో విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పదుకొణె లుక్స్ కూడా చూపించారు. ఈ మూవీలో దీపికా అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

పఠాన్ హిట్ అయిన జోష్‌లో ఉన్న షారూఖ్.. జవాన్‌ సినిమాతో కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. 2 నిమిషాల 12 సెకన్లలో షారూఖ్‌ లుక్ అదిరిపోయింది. నేను విలన్ అయితే.. ఏ హీరో నా ముందు నిలబడలేడు.. అంటూ కింగ్ ఖాన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. చివర్లో గుండుతో షారూక్ సరికొత్తగా ఉంది. విలనిజం పండస్తూ.. పాత సాంగ్‌కు ఫన్నీగా డ్యాన్స్ వేస్తూ అలరించాడు. బాక్సాఫీసు రికార్డులు కచ్చితంగా బద్దలు కొడుతుందని సినీ ప్రేమికులు అంచనా వేస్తున్నారు. 

 

Trending News