Siddhu Jonnalagadda : టిల్లు స్క్వేర్ సినిమాలో ఇంత పెద్ద మిస్టేక్.. సిద్ధు కూడా చూసుకోలేదా..

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బ్లాక్ బస్టర్ సినిమా డీజే టిల్లు కి సీక్వెల్ గా మార్చ్ 29 న థియేటర్ లలో విడుదల అయిన టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ హిట్ టాక్ తో భారీ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది. అయితే ఈ సినిమా కి కూడా కర్త, కర్మ, క్రియ తానే అయ్యి ముందుకు నడిపిన సిద్ధు జొన్నలగడ్డ సినిమాలో ఒక పెద్ద మిస్టేక్ ను గమనించలేకపోయాడు..

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 2, 2024, 11:19 AM IST
Siddhu Jonnalagadda : టిల్లు స్క్వేర్ సినిమాలో ఇంత పెద్ద మిస్టేక్.. సిద్ధు కూడా చూసుకోలేదా..

Tillu Square Mistake : చిన్న బడ్జెట్ సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమా డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోగించింది. డీజే టిల్లు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు టిల్లు స్క్వేర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. మార్చ్ 29 న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే మంచి టాక్ తో భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది.

మొదటి భాగంతో పోల్చుకుంటే ఈ సినిమాలో మంచి కథతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కువగా నే ఉంటుంది. ఈ సినిమాలో కూడా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయాలు సిద్ధు జొన్నలగడ్డ దగ్గరుండి చూసుకున్నారు. కానీ ఈ సినిమాలో జరిగిన పెద్ద మిస్టేక్ ని మాత్రం ఎవరూ గుర్తించలేకపోయారు.

సినిమా కోసం ప్రాణాలు పెట్టి పనిచేసిన సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ మల్లిక్ రామ్, ఆఖరికి నిర్మాతలు కూడా ఈ మిస్టేక్ ని గుర్తించలేదు. వివరాల్లోకి వెళితే సినిమాలో మొదటి పాట జరుగుతున్న సమయంలో ఒక కీలక పాత్ర టిల్లు కి కాల్ చేసి ఈనెల 27వ తేదీన ఈవెంట్ చేయాలని చెబుతారు.

ఆ తర్వాత హీరో హీరోయిన్ ని చూస్తాడు. ఆమె కోసం వెతుకుతూ ఒక నెల గడిచిపోయినట్లు కూడా చూపిస్తారు. ఆ తర్వాత మళ్లీ ఆమెతో ప్రేమాయణం. ఇలా రెండు నెలలు గడిచిపోయినట్లే చూపిస్తారు. కానీ మళ్లీ అదే వ్యక్తి ఫోన్ చేసి ఈనెల 27వ తేదీ ఫంక్షన్ ఉంది అని చెప్పాను కదా అంటూ మళ్ళీ గుర్తు చేస్తాడు. 

మొదటేమో ఈనెల అని చెప్పి దాదాపు రెండు నెలలు గడిచిపోయిన తర్వాత మళ్లీ వచ్చి 27వ తేదీ ఈవెంట్ అంటూ అనటం ఏంటి? సినిమా కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సినిమా కోసం ఇంత కష్టపడినా సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ మల్లిక్ రామ్ ఆఖరికి బోలెడు ఖర్చు పెట్టిన నిర్మాతలు కూడా ఈ లాజిక్ ని పట్టించుకోలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Seema Reddy (@seemaareddy)

Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలో రేపో ఎప్పుడూ కూలుతుందో..? హరీశ్ రావు సందేహం

Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News