Balakrishna L Word: బాలకృష్ణ నోటి వెంట బూతు పదం... డీజే టిల్లు రియాక్షన్ చూశారా?

L word From Balakrishna: నందమూరి బాలకృష్ణ నోటి వెంట ఒక బూతు పదం దొర్లిన అంశం హాట్ టాపిక్ అయింది, దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 23, 2023, 09:35 AM IST
Balakrishna L Word: బాలకృష్ణ నోటి వెంట బూతు పదం... డీజే టిల్లు రియాక్షన్ చూశారా?

Abusive L word From Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.  మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్ లో రాబట్టిన సినిమాగా నిలిచింది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హనీ రోజ్, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సినిమా యూనిట్ ఒక సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సక్సెస్ ఈవెంట్ కి సినిమా యూనిట్ తో పాటు యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ కూడా హాజరయ్యారు. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ సహా మరి కొందరు దర్శకులు కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.

అయితే బాలకృష్ణ ప్రసంగంలో భాగంగా మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను నిజాం కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో నార్త్ నుంచి వచ్చిన వాళ్ళని అరే ఓ సాలె అలాగే మరో బూతు మాట పిలిచే వాళ్ళం అని చెబుతూ అదే బూతు మాట బాలకృష్ణ నోటి వెంట పలికించడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ మాట అంటున్నప్పుడు వెనకే ఉన్న హరీష్ శంకర్ సహా విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ వంటి వారికి ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియలేదు, దీంతో వారిలో హరీష్ శంకర్ చప్పట్లు కొట్టగా సిద్దు జొన్నలగడ్డ  ఆయన ఏం చెబుతున్నారు? అనేది అర్థం కాక మొహం చిట్లించి మరీ చూడడాన్ని ఆడియన్స్ పసిగట్టారు. ఈ విషయం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. మరో ఇదే అంశం మీద మీ ఉద్దేశం ఏమిటో కామెంట్ చేయండి.

Also Read: Honey Rose Drinking : బాలయ్యతో కలిసి మందు కొడుతోందిగా.. హనీ రోజ్ యవ్వారం మామూలుగా లేదే

Also Read: Thaman Trolls : ఇక్కడ శివుడంటాడు.. అక్కడ చచ్చినా పర్లేదంటాడు.. తమన్ అతి డైలాగులపై సెటైర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 
 

Trending News