UP Crime: అమానుష ఘటన.. యువకుడి ప్రైవేట్ పార్ట్‌లో గాలి నింపి..

Ghaziabad Crime: ఘజియాబాద్‌లోని సిహానీ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ అమానుష ఘటన కలకలం రేపుతోంది. ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. యువకుడి ప్రైవేట్ పార్ట్‌లో ఎయిర్ పైపు గాలి నింపడంతో ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2023, 11:28 PM IST
UP Crime: అమానుష ఘటన.. యువకుడి ప్రైవేట్ పార్ట్‌లో గాలి నింపి..

Ghaziabad Crime: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటనలో వెలుగులోకి వచ్చింది. పెట్రోల్ బంక్‌లో ఇద్దరు మధ్య వాగ్వాదం జరగ్గా.. ఒక యువకుడు మరో యువకుడి ప్రైవేట్ పార్ట్‌లో ఎయిర్ పంపు పెట్టి గాలికొట్టాడు. దీంతో బాధితుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఘజియాబాద్‌లో ఈ సంఘటన చోట చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివరాలు ఇలా.. 

సిహాని గేట్‌లోని పెట్రోల్‌ పంపులో కార్‌ వాష్‌గా పనిచేస్తున్న బాధిత యువకుడు.. మరో ఉద్యోగి మోహిత్‌తో గతంలో నుంచి పలుమార్లు గొడవ పడ్డాడు. ఈ 25న కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మోహిత్ విచక్షణ కోల్పోయాడు. కోపం యువకుడిపై క్రూరత్వం ప్రదర్శించాడు. ఎయిర్ పంప్‌తో ప్రైవేట్ పార్ట్‌లో గాలిని నింపాడు. దీంతో బాధితుడి కడుపు, పేగులు తీవ్రంగా గాయపడ్డాయి. ఆ తర్వాత కడుపులో రక్తస్రావం ప్రారంభమైంది. అతని పరిస్థితి విషమంగా మారడంతో మోహిత్ పెట్రోల్ పంపు నుంచి పారిపోయాడు. ఇతర ఉద్యోగులు బాధిత యువకుడిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుండగా.. పరిస్థితి విషమంగా ఉంది. 

విషయం తెలుసుకున్న బాధిత కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి సోదరుడు మోహిత్‌పై సిహాని గేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితుడు సోదరుడి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఏసీపీ సిహానీ గేట్‌ అలోక్‌ దుబే తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారమన్నారు. త్వరలో పట్టుకుని.. పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.

Also Read: NZ Vs ENG: కళ్లు చెదిరే రనౌట్ చేసిన వికెట్ కీపర్.. వీడియో చూశారా..?  

Also Read: Rythu Bharosa-PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్‌లోకి డబ్బులు జమ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News