Mumbai Airport: ఎయిర్‌పోర్టులో దారుణం.. వీల్‌చైర్‌ లేక నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిన వృద్ధుడు

Wheelchair Shortage Old Man Died: విమానాశ్రయంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పండు ముదసలి వ్యక్తి ఎమిగ్రేషన్‌ ప్రక్రియ కోసం వేచి చూస్తూ నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయాడు. వీల్‌ చైర్‌ లేక ఆయన మృతి చెందాడు. ఈ సంఘటన ముంబైలో జరిగింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 16, 2024, 05:08 PM IST
Mumbai Airport: ఎయిర్‌పోర్టులో దారుణం.. వీల్‌చైర్‌ లేక నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిన వృద్ధుడు

Old Man Collapsed At Mumbai Airport: విదేశాలకు వెళ్లేందుకు ఓ వృద్ధుడు విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఎమిగ్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు వరుసలో నిల్చున్నాడు. నిలబడలేక వీల్‌చైర్‌ అడిగాడు. కానీ అప్పటికే వీల్‌ చైర్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. వీల్‌ చైర్ల కొరతతో ఆయన నడిచాడు. నడుస్తూనే చాతకాక కుప్పకూలిపోయాడు. అనంతరం అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: HCA Cricket Coach: క్రికెట్‌కే మాయని మచ్చ.. మద్యం తాగుతూ బస్సులో మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన

అమెరికాలోని భారత సంతతికి చెందిన వృద్ధుడు ఫిబ్రవరి 12వ తేదీన సోమవారం తన భార్యతో కలిసి ఎయిర్‌ ఇండియా విమానంలో భారతదేశానికి వచ్చాడు. న్యూయార్క్‌ నుంచి ముంబై చేరుకున్నాడు. అయితే వయసు 80 ఏళ్లు పైబడి ఉండడంతో టికెట్‌లతోపాటు వీల్‌ చైర్లు కూడా బుక్‌ చేసుకున్నారు. విమానాశ్రయంలో వీల్‌ చైర్‌ల కొరత ఏర్పడడంతో ఈ వృద్ధ దంపతులకు ఒక్క వీల్‌చైర్‌ మాత్రమే ఇచ్చారు. ఆ చక్రాల కుర్చీలో తన భార్యను కూర్చొపెట్టుకుని ముందుకు వెళ్లాడు.

Also Read: Organ Donor: సామాన్యులకు కూడా 'వీఐపీ' అంత్యక్రియలు.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

అలా భార్యను కూర్చో బెట్టుకుని విమానం దిగన చోటు నుంచి ఇమిగ్రేషన్‌ కౌంటర్‌ వద్దకు చేరుకున్నాడు. అక్కడకు చేరుకోగానే ఆయన కుప్పకూలిపోయాడు. ఈ సంఘటనతో వెంటనే స్పందించిన విమానాశ్రయ సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆయన గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. విమానం నుంచి 1.5 కిలోమీటర్ల దూరం నడవడంతో ఆ పెద్దాయన ఆయాసానికి గురై గుండెపోటు వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. 

ఈ విషాద సంఘటనపై ఎయిర్‌ ఇండియా స్పందించింది. 'ఇది దురదృష్టకరమైన సంఘటన. ఆ రోజు వీల్‌చైర్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. చక్రాల కుర్చీని ఏర్పాటుచేసే వరకు ఎదురుచూడాలని ఆయనకు మేం సూచించాం. కానీ ఆయన తన భార్య వెంటే నడుచుకుంటూ వెళ్తానని చెప్పారు. మృతుడి కుటుంబంతో మేం సంప్రదింపులు చేస్తున్నాం. వారికి అవసరమైన సాయం అందిస్తాం' అని ప్రకటించింది. ఆరోజు విమానాశ్రయంలో వీల్‌ చైర్‌ల కొరత తీవ్రంగా ఉందని తెలిసింది. ఆ రోజు విమానంలో 32 మంది వీల్‌చైర్‌ కోసం బుక్‌ చేసుకున్నారు. అయితే 15 మందికి మాత్రమే వీల్‌చైర్లు అందుబాటులో ఉన్నాయని విమానాశ్రయ సిబ్బంది వెల్లడించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News