Nizamabad Road Accident: నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Nizamabad Road Accident News: రోడ్డు ఎక్కితే తిరిగి ఇంటికి చేరే వరకు ప్రాణానికి గ్యారెంటీ లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. రాత్రి, పగలు అని తేడా లేకుండా రోడ్లన్నీ రక్తమోడుతున్నాయి. తాజాగా నిజామాబాద్‌లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2023, 09:44 PM IST
Nizamabad Road Accident: నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Nizamabad Road Accident News: రోడ్డు ఎక్కితే తిరిగి ఇంటికి చేరే వరకు ప్రాణానికి గ్యారెంటీ లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. రాత్రి, పగలు అని తేడా లేకుండా రోడ్లన్నీ రక్తమోడుతున్నాయి. తాజాగా నిజామాబాద్‌లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

నిజామాబాద్‌ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఆటోను ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణంపాలు కాగా మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారిని రేంజల్ మండలం జూపల్లి వాసులుగా గుర్తించారు. నిజామాబాద్‌లోని అర్సపల్లి బైపాస్‌ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూరు గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఒక కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. చనిపోయిన ముగ్గురు యువకులను నందిపేట్ మండల కేంద్రానికి చెందిన వారిగా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న వారు కొండగట్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు సుభాష్‌నగర్‌కు చెందిన ఉమ్మడి అశోక్, మంద మోహన్‌, రమేష్‌‌గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Trending News