Nizamabad Crime: నిజామాబాద్‌ జిల్లాలో అక్కాచెల్లెళ్లు దారుణ హత్య.. ఏం జరిగిందంటే..?

Sisters Murder In Nizamabad: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాలకు నిప్పు పెట్టి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2023, 02:55 PM IST
Nizamabad Crime: నిజామాబాద్‌ జిల్లాలో అక్కాచెల్లెళ్లు దారుణ హత్య.. ఏం జరిగిందంటే..?

Sisters Murder In Nizamabad: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను దారుణంగా హత్య చేసిన దుండగులు.. మృతదేహాలకు నిప్పు పెట్టారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి.. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. వివరాలు ఇలా.. ఆర్మూర్ పట్టణంలో జిరాయత్ నగరానికి చెందిన మగ్గిడి రాజవ్వ (72), గంగవ్వ (62) అక్కాచెల్లెళ్లు. ఇద్దరు ఇంట్లో ఉంటూ.. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.   

మంగళవారం అర్ధరాత్రి ఇంట్లోకి దూరిన గుర్తు తెలియని వ్యక్తులు.. రాజవ్వ, గంగవ్వలపై బండ రాయితో మోదీ కిరాతంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాలకు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. బుధవారం ఉదయం ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు.. కిటికీ వద్దకు చూడగా కాలిపోయిన స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. షాక్‌కు గురైన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. బంగారం కోసమే హత్య చేశారా..? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో విచారిస్తున్నారు. స్థానికులతో మాట్లాడి వివరాలను తెలుసుకుంటున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ ప్రభాకర్‌రావు, సీఐ సురేశ్‌.. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. 

Also Read: Ongole Attack Video: ఒంగోలులో దారుణం.. యువకుడి నోట్లో మూత్రం పోసిన దుండగులు  

Also Read: Viral Video: జేసీబీపై దూసుకువచ్చిన భారీ బండరాళ్లు.. క్షణాల్లో తప్పించుకున్న డ్రైవర్.. వీడియో వైరల్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News