Triangle Love: 'బేబీ' సినిమా కన్నా దారుణం.. ఇద్దరిని ప్రేమించి ఒకరిని చంపిన ప్రియురాలు

Traingle Love Story Sad Ending: ఎయిర్‌పోర్టు హోటల్‌లో జరిగిన పరిచయం ప్రేమకు దారితీసింది. తర్వాత కలిసి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అడగ్గా అప్పటికే వేరే యువకుడిని ప్రేమిస్తుండడంతో ఆ యువతి నిరాకరించింది. మొదటి ప్రియుడితో కలిసి ఉన్న ఫొటోలు కనిపించడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు పెళ్లి చేసుకోవాలని కోరిక అతడు ప్రాణాలు కోల్పోయాడు. మూడు నగరాల చుట్టూ జరిగిన ఈ నేర సంఘటన నివ్వెరపోయేలా ఉంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 6, 2024, 08:24 PM IST
Triangle Love: 'బేబీ' సినిమా కన్నా దారుణం.. ఇద్దరిని ప్రేమించి ఒకరిని చంపిన ప్రియురాలు

Brutal Incident With Love: హోటల్‌లో పని చేసే యువతితో అయిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ బంధం మరింత దగ్గరవడంతో వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. చక్కగా సాగుతున్న ఈ జీవితంలో ఆ యువతి ఫోన్‌లో ఉన్న ఫొటోలు, చాటింగ్‌లు తీవ్ర అలజడి రేపింది. ఆ ఫొటోలు ఎవరివని నిలదీయగా అప్పటికే ఓ యువకుడితో ఆమె ప్రేమ యవ్వారాలు నడిపిస్తోందని తెలిసింది. తరచూ వీరి మధ్య ఈ గొడవ జరుగుతోంది. ఇది సహించలేక యువతి అతడిని తన మొదటి ప్రియుడి సహాయంతో దారుణంగా హత్య చేసి పరారైంది. హత్య చేసి అతడి ఫోన్లు లాక్కొని విమానం ఎక్కబోతుండగా ఆ యువతీయువకులను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో వారు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది.

Also Read: Cockroach Vande Bharat Train: భోజనంలో బొద్దింక.. 'వందే భారత్‌' ప్రయాణికుడికి విస్తుగొల్పే ఘటన

మహారాష్ట్రలోని పుణెకు సందీప్‌ కుమార్‌ కాంబ్లే (44) కార్ల వ్యాపారి. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తా విమానాశ్రయం హోటల్‌లో పని చేసే అంజలి షా (25)తో పరిచయమైంది. అది కాస్త వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. అనంతరం ఆమెను పెళ్లి చేసుకోవాలని సందీప్‌ కుమార్‌ ఒత్తిడి చేశాడు. అయితే అప్పటికే అంజలి తన సహచరుడు బికాష్‌ కుమార్‌ షా (23)తో సహ జీవనం చేస్తోంది. తరచూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయాలని చెబుతుండడంతో తన ప్రియుడైన బికాశ్‌ కుమార్‌కు విషయం చెప్పింది. ఈ క్రమంలోనే అంజలి, బికాశ్‌ కలిసి ఉన్న ఫొటోలు బయటపడ్డాయి. ఈ ఫొటోలు చూసిన సందీప్‌ కుమార్‌ అంజలిని నిలదీశాడు.

Also Read: Dog Biscuit: ఇదేం 'కుక్క బిస్కెట్‌ పంచాయితీ' అయ్య? సరికొత్త వివాదంలో రాహుల్‌ గాంధీ

అతడి వద్ద ఉన్న తమ ఫొటోలను తీసుకుని.. సందీప్‌ను చంపేయాలని అంజలి, బికాశ్‌ ప్రణాళిక వేసుకున్నారు. ఈ క్రమంలోనే కోల్‌కత్తాకు రావాలని పిలవగా మొదట సరేనన్న సందీప్‌ ఆఖర్లో ప్లాన్‌ మార్చాడు. అంజలినే గౌహతికి రావాలని పిలిచి అక్కడ ఓ స్టార్‌ హోటల్‌లో గది బుక్‌ చేశాడు. ఆదివారం గౌహతిలోని హోటల్‌లో ఇద్దరు కలుసుకున్నారు. అయితే సందీప్‌కు తెలియకుండా బికాశ్‌ అదే హోటల్‌లో ఓ గది బుక్‌ చేసుకుని వారికన్నా ముందే వచ్చేశాడు. హోటల్‌ గదిలో అంజలి, సందీప్‌ వెళ్లాక బికాశ్‌ కూడా వచ్చాడు. అతడిని చూసిన సందీప్‌ వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నువ్వేమిటీ ఇక్కడ' అని నిలదీశాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అనంతరం బికాశ్‌, అంజలి కలిసి సందీప్‌ను తీవ్రంగా కొట్టి హోటల్‌ గది నుంచి పారిపోయారు. వెళ్తూ వెళ్తూ సందీప్‌కు రెండు ఫోన్లను ఎత్తుకెళ్లారు. 

రక్తపు మడుగులో ఉన్న సందీప్‌ను చూసి హోటల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాలు పరిశీలించగా అంజలి, బికాశ్‌ల దృశ్యాలు కనిపించాయి. రిజిస్టర్‌లో సందీప్‌ ఫోన్‌ నంబర్‌ ఉండడంతో ట్రాప్‌ చేశారు. వారు ఎక్కడికి వెళ్తున్నారో అనుసరించారు. కోల్‌కత్తా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టు వెళ్తున్నారని తెలుసుకుని వారికన్నా ముందే పోలీసులు వాలిపోయారు. ఎయిర్‌ పోర్టులో అంజలి, బికాశ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేపట్టి విచారణ చేపట్టగా నిందితులు ఆసక్తికర విషయాలు తెలిపారు. 'పెళ్లి చేసుకోమని వేధించడం.. బికాశ్‌ను వదిలేయమని చెప్పడంతోనే సందీప్‌ను హతమార్చాం' అని విచారణలో అంజలి తెలిపింది. అంతేకాకుండా 'బికాశ్‌తో నేను కలిసి ఉన్న ఫొటోలను తీసుకుని సందీప్‌ బెదిరిస్తున్నాడు' అని చెప్పింది.

కాగా వాళ్లు చెప్పే విషయాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం సందీప్‌ నివాస ప్రాంతం పుణెకు తరలించారు. ఈ సంఘటన 'బేబీ' సినిమా కన్నా దారుణంగా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. 'అమ్మాయిలు ఇలా తయారేంట్రా' అని కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 'నచ్చకపోతే వదిలేయాలి.. లేదా అసలు చెప్పి దూరమవ్వాలి. అంతేగానీ ఈ చంపడాలు ఏంటమ్మ' అని పలువురు కామెంట్ చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News