Operating System: త్వరలో మేకిన్ ఇండియా ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్, యాపిల్ మార్కెట్‌కు దెబ్బేనా

Operating System: ప్రముఖ టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్ సంస్థలకు భారత ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కన్పిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయమే దీనికి కారణంగా ఉంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 25, 2022, 01:13 PM IST
 Operating System: త్వరలో మేకిన్ ఇండియా ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్, యాపిల్ మార్కెట్‌కు దెబ్బేనా

Operating System: ప్రముఖ టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్ సంస్థలకు భారత ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కన్పిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయమే దీనికి కారణంగా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్లలో రెండు రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ పని చేస్తున్నాయి. ఒకటి గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్ వెర్షన్, రెండవది యాపిల్ ఫోన్స్ మాత్రమే సంబంధించిన ఐఓఎస్. ఇప్పుడు ఈ రెండు విదేశీ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు ప్రత్యామ్నాయంగా స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మీడియా ముందు వెల్లడించారు. దీనికోసం వివిధ పరిశ్రమల నిమిత్తం పర్యావరణ వ్యవస్తను సులభతరం చేయనున్నామన్నారు. స్వదేశీ హ్యాండ్ సెట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై కేంద్ర ప్రభుత్వం (Central government) ఆసక్తిగా ఉందన్నారు రాజీవ్ చంద్రశేఖర్.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇప్పటి వరకూ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లే (IOS) ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ..అంతగా ప్రాచుర్యంలో రాలేకపోయాయి. ఎందుకంటే అప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లు మార్కెట్లో విస్తరించేశాయి. అయితే ఇప్పుడు నేరుగా కేంద్ర ప్రభుత్వమే కొత్తగా ఆపరేటింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టనుండటంతో..గూగుల్, యాపిల్ కంపెనీ మార్కెట్‌కు దెబ్బ తగిలే అవకాశాలున్నాయనేది నిపుణులు చెబుతున్న మాట.

Also read: Todays Gold Price: పెరిగిన పసిడి ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News