Union Budget 2024 IT Slabs: ఉద్యోగులపై జాలి చూపని నిర్మలమ్మ.. పొగడ్తలు తప్ప ఒక్క రూపాయి లాభం లేదు

Income Tax Relaxation: సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న మధ్య తరగతి ప్రజలకు నిరాశే మిగిలింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయ పన్ను వర్గాలకు ఎటువంటి ఊరట లభించలేదు. కానీ పన్ను చెల్లింపుదారులపై మాత్రం ప్రశంసలు కురిపించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 1, 2024, 03:46 PM IST
Union Budget 2024 IT Slabs: ఉద్యోగులపై జాలి చూపని నిర్మలమ్మ.. పొగడ్తలు తప్ప ఒక్క రూపాయి లాభం లేదు

IT Relaxation: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆదాయ పన్ను వర్గాలకు మాత్రం శుభవార్త వినిపించలేదు. ఉద్యోగులకు ఊరట లభించేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులేదని కేంద్ర మంత్రి నిర్మల బడ్జెట్‌ ప్రసంగంలో స్పష్టం చేశారు. గత బడ్జెట్‌లో ప్రకటించిన రూ.7లక్షల వరకు వార్షిక ఆదాయం వరకు పన్ను మినహాయింపు కొనసాగుతుంది.

రూ.7 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేదు. గతంలో ఎలాంటి పన్నుల స్లాబులు ఉన్నాయో.. వాటినే అమలు చేస్తామని తెలిపారు. ప్రత్యేక్ష, పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా నిర్మల సీతారామన్‌ ప్రసంగం కొనసాగించారు. 'దేశంలో పన్ను చెల్లింపుదారులు 2.4 రెట్లు పెరిగారు. పన్ను చెల్లింపుదారుల సహకారం దేశాభివృద్ధికి ఉపయోగపడుతోంది. మేము పన్ను చెల్లింపుదారులను అభినందిస్తున్నాం' అని ప్రశంసలు కురిపించారు. అంతే కానీ స్లాబ్‌ల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.

కొత్త ఆదాయపు పన్ను స్లాబ్ లు ఇలా
రూ.3 6 లక్షల మధ్య ఆదాయంపై 5 శాతం పన్ను (సెక్షన్ 87A కింద పన్ను రాయితీ అందుబాటులో ఉంది)
రూ.6-9 లక్షల మధ్య ఆదాయంపై 10 శాతం పన్ను (రూ. 7 లక్షల వరకు ఆదాయంపై సెక్షన్ 87A కింద పన్ను రాయితీ అందుబాటులో ఉంది)
రూ.9-12 లక్షల మధ్య ఆదాయానికి 15 శాతం పన్ను
రూ.12-15 లక్షల మధ్య ఆదాయానికి 20 శాతం పన్ను
రూ.15 లక్షలు.. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం పన్ను విధింపు

*కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు అన్ని వర్గాల వ్యక్తులకు, వృద్ధులు, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు కూడా ఒకే విధంగా ఉంటాయి.

Also Read: Budget 2024: నిర్మలమ్మ ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో కీలకమైన 'ఆరు' అంశాలేమిటో తెలుసా..

Also Read: PM Kisan Budget 2024: రైతులకు ప్రధాని మోదీ భారీ కానుక.. బడ్జెట్‌లో తీపి కబురు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News