Bounce electric scooter : బౌన్స్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌‌లు వచ్చేశాయి.. ధర తక్కువ, మైలేజ్‌ ఎక్కువ

Bounce Infinity electric scooter launched: బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్‌‌ను ఈకో మోడ్‌లో చార్జ్‌ చేసిన త‌ర్వాత 85 కిలోమీట‌ర్ల వరకు ప్ర‌యాణించొచ్చు. స్వాపింగ్ ఫీచ‌ర్ ద్వారా క‌న్వెన్ష‌ల్ సాకెట్‌ ద్వారా బ్యాట‌రీని చార్జ్ చేసుకోవొచ్చు. బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ద్వారా ఉపయోగించుకోవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 06:35 PM IST
  • ప్రస్తుతం ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లకు బాగా డిమాండ్
  • ఇన్ఫినిటీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన బౌన్స్..
  • వ‌చ్చే ఏడాది మార్చ్ నుంచి బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌‌ డెలివ‌రీలు ప్రారంభ‌ం
 Bounce electric scooter : బౌన్స్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌‌లు వచ్చేశాయి.. ధర తక్కువ, మైలేజ్‌ ఎక్కువ

Bounce launches Infinity E1  electric scooters at starting price of Rs 45099: ప్రస్తుతం ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లకు బాగా డిమాండ్ పెరుగుతోంది. తాజాగా బెంగ‌ళూర్‌కు చెందిన స్టార్ట‌ప్ కంపెనీ బౌన్స్.. ఇన్ఫినిటీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను మార్కెట్‌లోకి లాంఛ్​ చేసింది. ఇక బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 (Bounce Infinity E1) ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌‌ డెలివ‌రీలు వ‌చ్చే ఏడాది మార్చ్ నుంచి ప్రారంభ‌ంకానున్నాయి. ఇవి రెడ్‌, బ్లాక్‌, వైట్‌, సిల్వ‌ర్ గ్రే రంగుల్లో ల‌భిస్తున్నాయి. 

వీటి ఫీచ‌ర్ల కూడా బాగానే ఉన్నాయి. స్మార్ట్‌ ఫోన్ క‌నెక్ట‌వివిటీతో పాటు స్మార్ట్‌ ఫోన్ అప్లికేష‌న్‌లతో ఈ స్కూటర్‌‌లు రానున్నాయి. అలాగే వీటికి రివ‌ర్సింగ్ మోడ్‌ కూడా ఉంది. ఇక బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్‌‌ను ఈకో మోడ్‌లో చార్జ్‌ చేసిన త‌ర్వాత 85 కిలోమీట‌ర్ల వరకు ప్ర‌యాణించొచ్చు. స్వాపింగ్ ఫీచ‌ర్ ద్వారా క‌న్వెన్ష‌ల్ సాకెట్‌ ద్వారా బ్యాట‌రీని చార్జ్ చేసుకోవొచ్చు. 

బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (Battery as a service) ద్వారా ఉపయోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో ఏర్పాటు చేసిన బ్యాటరీ స్వాపింగ్‌ (swappable battery) స్టేషన్లలో.. బ్యాటరీ ఛార్జ్ జీరో కాగానే, ఆయా స్వాపింగ్‌ స్టేషన్ల ద్వారా ఫుల్‌ ఛార్జ్‌ బ్యాటరీలను (battery) తీసుకుని ఉపయోగించుకోవచ్చు. ఇక దేశవ్యాప్తంగా 3500 బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లను బౌన్స్‌ (Bounce) ఏర్పాటుచేయనుంది. 

Also Read : Omicron cases in India: కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు.. కేంద్రం ఏం చెబుతోందంటే..

బ్యాటరీ ప్లస్ ఛార్జర్‌‌తో కలిపి రూ 79,999 ఎక్స్ షోరూం ధ‌ర‌తో బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 (Bounce Infinity E1) ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ అందుబాటులో ఉండనుంది.. ఇక బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్‌ ద్వారా ఈ స్కూటర్‌ను తీసుకుంటే దీని ధర ఢిల్లీ (Delhi) ఎక్స్ షో రూమ్‌లో రూ. 45,099గా నిర్ణయించారు.  అయితే ప‌లు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎల‌క్ట్రిక్ వాహనాలకు స‌బ్సిడీలు (Subsidies) అందజేస్తున్నాయి. దీంతో ఈ స్కూట‌ర్ కొన్ని రాష్ట్రాల్లో బ్యాటరీ ప్లస్ ఛార్జర్‌‌తో కలిపి రూ 59,999కు ల‌భించే అవకాశం ఉంది. ఇక బౌన్స్ (Bounce) వాళ్లు.. ఇప్ప‌టికే ఇన్ఫినిటీ ఈ1 బౌన్స్ బుకింగ్స్‌ కూడా స్టార్ట్ చేశారు. రూ 499 తో టోకెన్ తీసుకుని బుంకింగ్ కన్ఫర్మ్ చేస్తున్నారు. మూడు సంవత్సరాల వారంటీను కంపెనీ అందిస్తోంది.

Also Read : Breaking News: అప్పుడు కేరళ.. ఇప్పుడు కర్ణాటక.. భారత్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు- థర్డ్ వేవ్ కు సంకేతమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News