Jagan Convoy: సీఎం జగన్‌ పర్యటనలో అపశ్రుతి.. వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

YS Jagan Convoy Hitted To Old Women: దాడి తర్వాత ఒకరోజు విశ్రాంతి అనంతరం వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్‌ చేపట్టిన యాత్రలో అపశ్రుతి దొర్లింది. సీఎం కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు ఆస్పత్రి పాలైంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 15, 2024, 08:32 PM IST
Jagan Convoy: సీఎం జగన్‌ పర్యటనలో అపశ్రుతి.. వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

YS Jagan Convoy: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటన చేస్తున్నారు. 'సిద్ధం' అనంతరం 'మేమంతా సిద్ధం' పేరిట బస్సు యాత్రలు చేపడుతున్నారు. ఈ సమయంలో రాళ్ల దాడి జరగడంతో ఒక్కసారిగా కలకలం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన అనంతరం ఒకరోజు విశ్రాంతి తీసుకున్న జగన్‌ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో చేపట్టారు.

Also Read: YS Jagan Stone Attack: వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు.. 'నాపై రాళ్లు వేయించింది చంద్రబాబే, పవన్‌ కల్యాణ్‌, బీజేపీనే'

ఈ పర్యటనలో ఒక అపశ్రుతి చోటుచేసుకుంది. నాగవరప్పాడులో బహిరంగ సభ అనంతరం తిరుగుప్రయాణమవుతున్న సమయంలో సీఎం కాన్వాయ్‌లోని ఓ వాహనం అదుపు తప్పింది. ఆ వాహనం ఓ వృద్ధురాలిని ఢీకొట్టింది. దీంతో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. రోడ్డు పక్కన సీఎం జగన్‌ పర్యటన చూసేందుకు వెంకట నరసమ్మ అనే వృద్ధురాలు వచ్చింది. బహిరంగ సభ అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో బస్సు యాత్రను చూస్తున్న వెంకట నర్సమ్మను కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టింది.

Also Read: Chandrababu Jagan Stone Attack: జగన్‌ విలాస పురుషుడు.. రాళ్ల దాడి కొత్త డ్రామా: చంద్రబాబు

 

వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి వెంటనే గుడివాడలోని ఆస్పత్రికి తరలించింది. ఈ ఘటనలో వృద్ధురాలి కాలి విరిగినట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం ఇంకా స్పందించలేదు. కాకపోతే వెంకట నర్సమ్మకు దగ్గరుండి వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించిందని తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News