Ambedkar Jayanthi Spl: దళిత జాతికి స్వాతంత్య్రం కోసం తెలుగు నేల నుంచే ఉద్యమించిన అంబేద్కర్

Ambedkar Jayanthi Spl: దళిత జాతికీ స్వాతంత్య్రమూ కోసం తెలుగు నేల నుంచే ఉద్యమించిన అంబేద్కర్. అంతేకాదు ఈ నేల నుంచే ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 13, 2024, 08:56 AM IST
Ambedkar Jayanthi Spl: దళిత జాతికి స్వాతంత్య్రం కోసం తెలుగు నేల నుంచే ఉద్యమించిన అంబేద్కర్

Ambedkar Jayanthi Special: అంబేద్కర్ గారినీ 1944లో హైదరాబాద్ రావాలని రెండు సంఘాల వారు ఆహ్వనించాయి. అణగారిన వర్గాల సంఘం సభలో పాల్గొనాలని ఆహ్వానించాయి. సెప్టెంబర్ 29న యాన రైలులో భాగ్యనగరానికి విచ్చేసారు. నాంపల్లి రైల్లే స్టేషన్‌లో అంబేద్కర్ గారిన చూసేందకు ప్రజలు పోటెత్తారు. ఆయనకు దిగే అవకాశం లేకుండా స్టేషన్ మొత్తం నిండిపోయింది. దీంతో ఆయన అక్కడ నుంచి డైరెక్ట్‌గా సికింద్రాబాద్ వెళ్లి సభలో ప్రసగించారు. దేశ స్వాతంత్య్రంతో పాటు దళిత జాతి స్వాతంత్య్రం కూడా రావాలని అప్పట్లో పిలుపునిచ్చారు. దేశ పాలనా అధికారంలో దళితులు భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. అంతేకాదు అందుకు సిద్దంగా ఉండటమే కాదు.. పోరాటానికి సిద్దం కావాలన్నారు.

కేంద్రంలో మంత్రి పదవికి రాజీనామా తర్వాత ఇక్కడే గడిపారు.
అంబేద్కర్ ఎపుడు హైదరాబాద్ వచ్చినా.. తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జె.హెచ్. సుబ్బయ్య ఇంట్లోనే ఉండేవారు. సికింద్రాబాద్‌లోని పీజీ రోడ్డులో ఉన్న 12వ బంగ్లా సుబ్బయ్య గారిదే. అంబేద్కర్ 1947లో నెహ్రూ మంత్రివర్గంలో న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు 1951లో అనుకోని కారణాల వల్ల ఆ యేడాది సెప్టెంబర్‌తో మంత్రి పదవకి రాజీనామా చేసారు. వెంటనే వారం రోజుల పాటు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానిక అనేక జాగ్రత్తలు చెప్పారు. అంతేకాదు వ్యక్తి పూజ నియంతృత్వానికి దారి తీస్తుందని చెప్పారు. ఎంతటి నాయకులకైనా అంతులేని అధికారాలన్ని అప్పగించవద్దని స్పష్టం చేశారు.

26 జనవరి 1950లో భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించిన సమయంలో దేశ భవితష్యత్తు ఎలా ఉంటుందనే ఆందోళనలో అంబేద్కర్ ఉండేవారు. దేశం తన స్వాతంత్య్రాన్ని నిలుపుకుంటుందా.. ? అనేది అంబేద్కర్ మదిలో మెదిలిన మొట్టమొదటి ఆలోచన. భారత్ స్వతంత్య్ర దేశంగా ఎపుడూ లేదు. కానీ ఒకపుడు స్వతంత్ర దేశమే. కానీ తన స్వాతంత్య్రాన్ని కోల్పోయిందనే ఆలోచననే అంబేద్కర్‌ను తొలిచేస్తూఉండేదని తన స్వీయ రచనలో అంబేద్కర్ పేర్కొన్నారు. మొత్తంగా మహమ్మద్ బిన్ ఖాసిం దండెత్తి వచ్చినపుడు ఆ ప్రాంతంలో రాజు దాహిర్ సైన్యాధిపతులే శత్రువుల నుంచి లంచాలు తీసుకొని రాజు తరుపున యుద్ధం చేయడానికి నిరాకరించారు. పృథ్వీరాజ్ చౌహాన్ పై దాడి కోసం స్వయంగా జయచంద్.. మహమ్మద్ ఘోరినీ ఆహ్వానించి స్యయంగా ఆహ్వానించారు. అంతేకాదు శివాజీ మొఘలుపై ఓ వైపు పోరాడుతుంటే.. మరోవైపు కొంత మంది మరాఠ పాలకులు , రాజ్‌పుట్ రాజులు మొఘలు చక్రవర్తుల తరుపున యుద్ధాలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సిక్కు సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేయడానికి బ్రిటీష్ వాళ్లు ప్రయత్నిస్తుంటే .. ముఖ్య సైన్యాధికారి గులాబ్ సింగ్ చూస్తూ ఊరుకున్న విషయాన్ని ప్రస్తావించారు. 1857లో మొదటి  స్వాతంత్య్ర తిరుగుబాటు సందర్భంగా దేశ వ్యాప్తంగా అందరు తిరుగుబాటు చేస్తే సిక్కులు మాత్రం ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయిన విషయాన్ని ప్రస్తావించారు.

భారతీయులు తమ మత విశ్వాసాలు, సిద్ధాంతాల కన్నా.. దేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా.. ? దేశం కన్నా మత విశ్వాసాలకు ప్రాధాన్యత ఇస్తారా ? అనేది ఆయన మనసులో బలంగా ఉండేది. కానీ ఒకటి మాత్రం ఒక నిజాన్ని చెప్పారు. రాజకీయ పార్టీలు దేశం కన్నా తమ సిద్ధాంతాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మాత్రం దేశం మరోసారి తన స్వాతంత్య్రాన్ని కోల్పోయే అవకాశాలున్నాయి. మరోవైపు ఓ సందర్భంలో  ఆర్ఎస్ఎస్ ఓసారి నిర్వహించిన సభకు విచ్చేసిన అంబేద్కర్ గారు.. అక్కడి స్వయం సేవకులు.. కులాలకు అతీతంగా సామూహిక భోజనం చేయడం చూసి ఆశ్యర్యపోయారు. అంతేకాదు దేశ అంతర్గత రక్షణ కోసం .. వాళ్లు పడుతున్న తాపత్రాన్ని కొనియాడారు. ఏది ఏమైనా దేశ స్వాతంత్య్రం కాపాడుకోవడం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడటానికి భారతీయులు కృతనిశ్చయులై ఉండాలన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News